చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని సమస్యాత్మక
ప్రాంతాలైన కందూరు, తమ్మినాయన పల్లెలో శనివారం సాయంత్రం ఎస్ఐ వెంకట నరసింహులు తన బృందంతో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్న నేపథ్యంలో ప్రజలందరూ సంయమనం పాటించాలని సూచించారు. అధికారుల సూచనలను పాటించకుంటే చట్టపరమైన చర్యలు తప్పవ న్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.