బాల్య వివాహాలు సమాజానికి అనర్థదాయకమని పులిచెర్ల ఐసిడిఎస్ సిడిపిఓ వాణిశ్రీ అన్నారు. మంగళవారం పులిచెర్ల అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆమె, తల్లులకు కిషోర్ వికాసం, పోషణ, విద్యపై అవగాహన కల్పించారు. బాలికల చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సిద్ధరామయ్య, సూపర్వైజర్లు విజయలక్ష్మి, రమాదేవి, కార్యకర్త మోబినా తాజ్, తల్లులు పాల్గొన్నారు.