చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలం చిట్టారెడ్డిపేట వద్ద ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం రోడ్డు సమీపంలో ఏనుగు పడి ఉండటాన్ని చూసిన స్థానికులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. చెరువు గట్టు నుంచి జారి పడి చనిపోయిందని భావించారు కానీ భారీగా తిన్న మామిడి పండ్లు అరగకపోవడంతోనే మరణించినట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు. ఈ ప్రాంతంలో ఏనుగుల సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది.