పులిచెర్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడి కేంద్రాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని నూతన సిడిపిఓ వాణిశ్రీ అన్నారు. పులిచెర్ల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓగా వాణిశ్రీ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సూపర్వైజర్లు విజయలక్ష్మి, రమాదేవి, మల్లీశ్వరి, శిరీష, సిడిపిఓ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.