పుంగనూరు కోర్టు ఆవరణంలో సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఆరిఫా అధ్యక్షతన శనివారం జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 19 సివిల్ కేసులు, 42 క్రిమినల్ కేసులు కక్షిదారులు పరిష్కరించుకున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఆరీఫా తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఆకుల చెన్నకేశవులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.