పుంగనూరు నియోజకవర్గం , పులిచెర్ల మండలంలో పింఛన్ పొందుతూ మృతి చెందిన వారి భాగస్వాములు 73 మందికి పింఛన్లు మంజూరైనట్లు ఎంపీడీవో రాజశేఖర్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవళంపేట-9, దిగువ పోకలవారిపల్లి-2, ఎర్రపాపిరెడ్డిపల్లి-4, గడ్డంవారిపల్లి-8, కల్లూరు-8, కమ్మపల్లి-4, కావేటిగారిపల్లి-3, మంగళంపేట 7, మత్తుకువారిపల్లి-1, పులిచెర్ల-10, మిగతా మూడు పల్లెల్లో 17 పెన్షన్లు మంజూరయ్యాయని అన్నారు.