చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎర్రచందనం చెట్టును నరికి ఎర్రచందనం దుంగలు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతున్నది. ఈ ఘటనపై ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యాధికారి మధుసూదనా చారి ఫారెస్ట్ అధికారులకు, పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.