చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలోని కుమారి వీధిలో మొహరం పండుగ సందర్భంగా పీర్ల చావడి వద్ద ఆదివారం తెల్లవారుజామున అగ్నిగుండం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పీర్ల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం అగ్ని గుండాన్ని వెలిగించారు. ఇందులో భాగంగా బళ్లారి డ్రమ్స్ వాయిద్యాలకు యువకులు కేరింతల కొడుతూ నృత్యాలు చేశారు. మొక్కుబడులు ఉన్న భక్తులు పీర్లకు నైవేద్యాలు సమర్పించారు.