పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మను ఆదివారం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. అమ్మవారి దర్శనానంతరం ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.