ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేయడం సీఎం చంద్రబాబు నైజం అని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా శనివారం పలమనేరులో జరిగిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. కూటమి పాలనలో నియోజకవర్గంలో ఇసుక, మైనింగ్, గ్రావెల్ అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ అన్నారు.