చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండలోని రణభేరి గంగమ్మ ఆలయం వద్ద భక్తుల సౌకర్యం ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంట్ ను బుధవారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ఈవో ఏకాంబరం పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం బోయకొండ గంగమ్మను దర్శించుకున్నారు.