మురికి నీటి గుంతలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో శనివారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు రొంపిచర్ల మండలంలోని ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన ఆసిఫ్ కుమార్తె అజమీర్జా(3) ఈ నేపథ్యంలో చిన్నారి వీధిలోని పిల్లలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మురికి నీటి గుంతలో పడింది. స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే చిన్నారి మృతి చెందింది. దీనితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.