చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలంలోని అంకాలమ్మ కొండ పరిసర ప్రాంతాలలో బుధవారం ఉదయం దూడ మృతి చెంది ఉండడం కలకలం రేపుతోంది. స్థానికుల వివరాలు మేరకు కురపల్లికి చెందిన కుమార్ తన పొలం వద్ద షెడ్డు వేసుకొని పాడి ఆవులను పెంచుతున్నాడు. అందులోని లేగ దూడను చిరుత పులి దాడి చేసి చంపేసిందని బాధితుడు వాపోయాడు. ఈ దాడి చిరుతదా లేదా మరేదైనా అడవి జంతువుదా అనే విషయం తెలియాల్సి ఉంది.