చిత్తూరు జిల్లా, పుంగనూరు బాలాజీ థియేటర్ వద్ద గురువారం సీఐ శ్రీనివాసులు వాహన తనిఖీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రికార్డు లేని వాహనాలకు జరిమానా విధించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అధికారి తెలిపారు. అంతేకాకుండా మైనర్లు వాహనాలు నడపరాదని హెచ్చరించారు. వాహనదారులు విధిగా లైసెన్సులను కలిగి ఉండాలన్నారు.