చిత్తూరు జిల్లా వైసిపి ఉపాధ్యక్షుడిగా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లికి చెందిన జడ్పీటీసీ సభ్యులు దామోదర్ రాజును నియమిస్తూ పార్టీ అధిష్ఠానం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు ఆయన మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీపీ మిథున్ రెడ్డి తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.