పుంగనూరు: డివిజన్ అధికారులతో సమావేశమైన జిల్లా అధికారి

58చూసినవారు
పుంగనూరు: డివిజన్ అధికారులతో సమావేశమైన జిల్లా అధికారి
పుంగనూరు పట్టణంలో బుధవారం పుంగనూరు డివిజన్ మండల వ్యవసాయ అధికారులు, ఏపీసీఎన్ ఎఫ్ సిబ్బందితో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి సూచించారు. అదేవిధంగా అర్హత ఆధారంగా అన్నదాత సుఖీభవ ప్రయోజనం కోసం ఆన్లైన్లో రైతుల ధ్రువీకరణను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏడిఏ శివకుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్