ప్రతిపక్ష నేతలైన సోనియా, రాహుల్ పై బిజెపి ప్రభుత్వం కేసులు పెట్టడం దారుణమని కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు సజాద్ బాషా బుధవారం ఉదయం 11:50 నిమిషాలకు తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలోని మొడెప్ప సర్కిల్లో ఆయన మాట్లాడుతూ ఈ విధమైన పనులు చేస్తుంటే రానున్న రోజులలో బిజెపి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు.