పుంగనూరు పట్టణంలో కోడిపందాలు నిర్వహిస్తున్న 8 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై లోకేశ్ మంగళవారం రాత్రి తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ పుంగమ్మ చెరువు వద్ద కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో తన సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు ఆయన చెప్పారు. కోడి పందాలు ఆడుతున్న 8మందిని అరెస్టు చేశామన్నారు. అలాగే ఒక పందెంకోడితో పాటు రూ 20,500 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.