పుంగనూరు: పంట పొలాలపై ఆగని ఏనుగుల దాడులు

71చూసినవారు
పుంగనూరు: పంట పొలాలపై ఆగని ఏనుగుల దాడులు
పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలంలో ఉన్న పాలెం పంచాయతీకి చెందిన కొంగర వారి పల్లె వద్ద ఆదివారం ఉదయం ఏనుగులు పంట పొలాల్లోకి ప్రవేశించి దాడులు చేశాయి. రైతు రామనాథ నాయుడు సాగు చేసిన పశుగ్రాసాన్ని నాశనం చేయడంతో పాటు, బోరు పైపులు, డ్రిప్ వ్యవస్థను కూడా ధ్వంసం చేశాయి. అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్