పుంగనూరు: పులిచెర్ల మండలంలో వారం రోజులుగా తిష్ట వేసిన ఏనుగులు

54చూసినవారు
పుంగనూరు: పులిచెర్ల మండలంలో వారం రోజులుగా తిష్ట వేసిన ఏనుగులు
పులిచెర్ల మండలం, దేవలంపేట సమీపంలోని అడవిలో గత వారం రోజులుగా 14 ఏనుగుల గుంపు తిష్ట వేశాయి. ఇలా తిష్ట వేయడమే కాకుండా టమాటా, మామిడి, కొబ్బరి తదితర పంటలను ధ్వంసం చేస్తున్నాయి. బుధవారం ఉదయం పులిచెర్ల మండలంలోని గండేవారి పల్లి వద్ద ఏనుగులు పంటలను ధ్వంసం చేసినట్లు బాధిత రైతులు తెలిపారు. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పగటిపూట అడవిలో ఉంటూ రాత్రిపూట పంట పొలాలపై ఏనుగులు దాడి చేస్తున్నాయని రైతులు తెలిపారు.

సంబంధిత పోస్ట్