పుంగనూరు మండలం లక్ష్మీపురం కాలనీ సమీపంలో స్వాతంత్ర సమరయోధుడు, తొలి శాసనసభ్యుడు బడల కృష్ణమూర్తికి చెందిన ఒక ఎకరం 25 సెంట్ల భూమికి వెళ్లే దారిని కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ప్రసాద్ స్వామి మాట్లాడుతూ అధికారులు స్పందించి దారిని తొలగించి తమ పూర్వీకుల భూమికి సరైన రాకపోకలు కల్పించాలన్నారు.