పుంగనూరు: పట్టణంలో ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు

55చూసినవారు
చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలోని అగ్నిమాపక కేంద్రంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈనెల 14 నుండి 20 వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అధికారి సుబ్బరాజు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్