చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ దేవాలయాలలో మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో కళ్యాణోత్సవం, గరుడోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామి దేవేరులను పలు రకాల పుష్పాలు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి మాడవీధులలో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు.