పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో జూలై 7వ తేదీన ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా విజయోత్సవ సంబరాలకు సిద్ధం కావాలని రాష్ట్ర కార్యదర్శి కిషోర్ మాదిగ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం పుంగనూరు పట్టణంలో జరిగిన మండల సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగంగా కిషోర్ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు కూడా అదే రోజు జరుగుతాయన్నారు.