పుంగనూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో బుధవారం రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం నమోదయింది. ఉరుముల శబ్దానికి ప్రజలు భయపడిపోయారు. ఉదయం నుంచి భానుడి ప్రతాపానికి ప్రజలు తట్టుకోలేక పోయారు. రాత్రి కురిసిన వర్షంతో సాధారణ ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించినా, టమాటా రైతులకు మాత్రం ఇది పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పంట చేతికి వచ్చే సమయానికి ఇలా వర్షాలు కురిస్తే తాము నష్టపోతామని రైతులు తెలియజేశారు.