పుంగనూరులో శివాజీ మహారాజు పట్టాభిషేక మాసాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది నిర్వహించే హిందూ సామ్రాజ్య దినోత్సవానికి ఈసారి కూడా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. శోభాయాత్ర నిర్వహణకు కావలసిన అనుమతుల కోసం నిర్వాహకులు శుక్రవారం సీఐ సుబ్బ రాయుడును కలిశారు. అధికార అనుమతులు పొందిన అనంతరం వేలాది హైందవ సోదరులతో శోభాయాత్ర నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.