చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, రాంపల్లి సమీపంలో గల శాంతినగర్లో కాపురం ఉంటున్న మణికంఠకు 7 సంవత్సరాల క్రితం సరస్వతితో పెద్దలు వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు మగసంతానం కలరు. మణికంఠ వేరే మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ తరచూ భార్యతో గొడవలు పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పిల్లలతో నిద్రిస్తున్న భార్య సరస్వతి పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.