రామసముద్రం మండలం , బల సముద్రం, గ్రామానికి చెందిన గంగాద్రి (40) కి సుశీలమ్మతో 20 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కుటుంబ కలహాల తో భార్య సుశీలమ్మ పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపం చెంది గంగాద్రి సోమవారం పంట పొలాలకు వాడే పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో గంగాద్రిని హుటాహుటిన పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.