విలేకరులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని శనివారం చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలోని ముడెప్ప సర్కిల్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం భాషా, ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో విలేకరులపై అక్రమ కేసులు పెట్టినందుకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు.