పుంగనూరు లోని సోమల మండలం, ఇరికి పెంట పంచాయతీ, బంగ్లా గ్రామంలోని శివయ్య నాయుడు ఇంటి వద్ద అరుదుగా సంవత్సరానికి ఒక్కసారి పూసేటువంటి మే పుష్పాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా శివయ్య నాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే నెల రెండవ వారంలో ఈ పుష్పాలు విరబూస్తాయని, ఇవి ఎంతో అరుదుగా ఉంటాయని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రజలు ఆ పుష్పాలను తమ సెల్ ఫోన్లలో ఫోటోలు తీసుకున్నారు.