పుంగనూరు నియోజకవర్గం, సదుం మండల తహసీల్దారుగా జయప్రకాశ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన కుప్పం ఆర్డీఓ కార్యాలయంలో పరిపాలన అధికారిగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో తహసీల్దారుగా ఉన్న మారుఫ్ హుస్సేన్ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డ సంగతి తెలిసిందే. మండలంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జయప్రకాష్ తెలియజేశారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.