కరేడు రైతుల సమస్యపై ముందుండి పోరాటం చేసిన బీసీవై అధినేత రామచంద్ర యాదవ్‌కు ఆదివారం కరేడు రైతులు, మహిళలు పుంగనూరులోని ఆయన నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ అన్యాయ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రైతులు, మహిళలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.