పుంగనూరు: గజ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు

70చూసినవారు
చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గజ వాహనంపై తిరుమాడ వీధులలో శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చాడు. స్వామివారి వాహన సేవలో కోలాటం, చెక్కభజనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మాడవీధులు గోవిందనామ నామస్మరణంతొ మారుమ్రోగాయి. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్‌పెక్టర్ మహేంద్ర బాబు, భక్తులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్