పుంగనూరు: వ్యక్తిపై కత్తితో దాడి

60చూసినవారు
పుంగనూరు: వ్యక్తిపై కత్తితో దాడి
పుంగునూరు మండలంలోని ప్రసన్నయ్యగారిపల్లెలో శుక్రవారం రెండు వర్గాల మధ్య గొడవ జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. భూ వివాదంపై చెలరేగిన ఘర్షణలో గ్రామనికి చెందిన సుబ్రహ్మణ్యం (34) పై అదే గ్రామానికి చెందిన మరో వర్గంలోని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కత్తి కడుపులోకి దిగడంతో గ్రామస్థులు హుటాహుటిన సుబ్రహ్మణ్యంను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్