చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం , ఆమిని గుంట గ్రామంలో కుక్కలు గుంపు దాడిలో స్థానిక గ్రామానికి చెందిన వెంకట రామయ్య, కుమారుడు సుబ్రహ్మణ్యం(48) గాయపడ్డాడు. గాయపడ్డ సుబ్రహ్మణ్యంను కుటుంబ సభ్యులు పుంగనూరుఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి 7 గంటలకు బాధితుడు మాట్లాడుతూ గ్రామంలో కుక్కలు గుంపు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని తెలిపారు.