పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో శనివారం రాత్రి 8 గంటల 45 నిమిషాల అనంతరం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఆకాశమంతా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. అనంతరం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో విసుగు చెందిన ప్రజలు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందినట్లు తెలిపారు. ఇక రైతులైతే తమ పంటలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షం కాస్త మేలు చేస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు.