పుంగనూరు పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మదనపల్లి సీనియర్ సివిల్ జడ్జ్, ఇన్ఛార్జి జడ్జి శిరీష్ తెలిపారు. శుక్రవారం కోర్టులో పోలీసులతో ఆయన సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్ పై పుంగనూరులో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. రాజీకి అనువైన కేసులను పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రభాకర్, సీఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.