పుంగనూరు మండలం సుగాల మిట్ట గ్రామం సమీపంలో ఇంటి నుంచి గోపాల్ నాయక్ (69) దుకాణం దగ్గరకు వెళ్తుండగా అటువైపు నుండి వస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని స్థానికులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. అనంతరం పోలీసులకు సమాచారం తెలిపారు. మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.