చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం పెద్ద తాండా , జువ్వలదిన్నె తాండా పరిసర ప్రాంతాలలో శనివారం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 2100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలియజేశారు. చట్ట వ్యతిరేక పనులకు శిక్ష తప్పదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఏఈ ఎస్ లు సుబ్రహ్మణ్యం, జోగేంద్ర, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.