జీడి నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలంలోని కృష్ణాపురం ప్రాజెక్ట్ లోని లోతైన గుంటలు, చెరువులు, బావులలోకి ఎవరూ వెళ్లకూడదని, ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఎస్ఐ రాజకుమార్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం కృష్ణాపురం ప్రాజెక్టు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ సూచించారు. పోలీసుల సూచనలను ప్రజలు విధిగా పాటించాలని అధికారి తెలిపారు.