చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి కి చెందిన అమర్నాథ్ కుమారుడు ఈనెల 7వ తేదీ నుంచి కనిపించడం లేదు. దీనితో కుటుంబ సభ్యులు బంధువులు, సమీప ప్రాంతాలలో వెతికి చూశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో మంగళవారం చౌడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.