చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలో సుబేదార్ వీధి, కుమ్మరి వీధి పీర్ల చావడిలో కొలువుదీరిన పీర్లను మేళా తాళాలతో అంగరంగ వైభవంగా పురవీధుల గుండా ఆదివారం ఊరేగింపు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు పీర్ల చావడి వద్దకు చేరుకొని దేవత మూర్తులకు సెంటు, పన్నీరు , అత్తరు, పుష్పాలను సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు.