పుంగనూరు మండలంలోని నల్లగుట్ట పల్లె తండాకు సంబంధించిన బడిలో 3, 4, 5 తరగతులను రద్దుచేసి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పూజగాని పల్లి పాఠశాలలో కలిపారని శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు పుంగనూరు పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ చిన్నపిల్లలు అంత దూరం వెళ్లి చదువుకోవడం చాలా కష్టమని వాపోయారు. మా పాఠశాల మా ఊరిలోనే ఉండాలని తల్లిదండ్రులు కోరారు.