పుంగనూరు మండలంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

70చూసినవారు
పుంగనూరు మండలంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
పుంగనూరు మండలంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు మండలంలోని ఈడిగపల్లి వద్ద ఈచర్ వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులు పొద్దుటూరు వాసులు విరుపాక్షిపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని పుంగనూరు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్