పుంగనూరు పరిధిలో గురువారం పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇన్ఛార్జ్ ఎంఈవో నటరాజ రెడ్డి బుధవారం తెలిపారు. ఇప్పటికే తరగతి గదులు, పాఠశాల పరిసర ప్రాంతాలను హెచ్ యమ్ ల పర్యవేక్షణలో శుభ్రపరుస్తున్నారు. మండల విద్యా అధికారి) మాట్లాడుతూ పుంగనూరు పరిధిలో 177 పాఠశాలలు ఉన్నాయన్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 140, ప్రైవేటు పాఠశాలు 37. పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.