పుంగనూరు నియోజకవర్గం లోని సోమల, చౌడేపల్లి, సదుం, పుంగనూరు మండలాలలో ఉన్న రామాలయాలలో వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవం అనంతరం పురవీధులలో సీతారాముల ఉత్సవ విగ్రహాలను మంగళ వాయిద్యాలు, బాణసంచా పేలుస్తూ ఊరేగించారు. ఊరేగింపులో ఏర్పాటుచేసిన చెక్కభజనలు కోలాటాలు భక్తులను ఆకట్టుకున్నాయి.