జిల్లాలో ఎక్కడైతే ఏనుగుల దాడులు ఎక్కువ జరుగు తుంటాయో అలాంటి చోట పంటలకు, ప్రజలకు రక్షణ కల్పించేందుకు త్వరలో సోలార్ ఫెన్సింగ్ పనులు మొదలు పెడతామని చిత్తూరు అటవీ శాఖ డిఎఫ్ ఓ ధరణి అన్నారు. ఈ సందర్భంగా ఆమె శనివారం చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల లో ఏనుగు చనిపోయిన స్థలాన్ని పరిశీలించారు. ఏనుగుల దాడిలో పంట నష్టపోయిన వారికి ప్రభుత్వం నుంచి పంట నష్టం వస్తుందని అన్నారు.