పుంగనూరులోని నగిరి వీధిలో వెలసిన శ్రీ సోమేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలల్లో భాగంగా శనివారం స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం స్వామి దేవేరులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన రథోత్సవానికి పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు ముందస్తుగా పూర్తి చేశారు.