సోమల మండలంలో పర్యటించిన ప్రత్యేక అధికారి

84చూసినవారు
సోమల మండలంలో పర్యటించిన ప్రత్యేక అధికారి
జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం గురువారం సోమల మండల కేంద్రంలోని పలు ప్రాంతాలలో జిల్లా టూరిజం ప్రత్యేక అధికారి గౌరీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామ సచివాలయాలు, అంగన్వాడి సెంటర్లు, కందూరు పిహెచ్సి ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఏ విధంగా వైద్యం అందుతుందో రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్