తిరుపతి తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా శనివారం పుంగనూరు లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన ఘటన క్షమాపణలు చెప్పి సర్దుకునే అంత చిన్న విషయం కాదన్నారు. తొక్కిసలాటకు కారణమైన బాధ్యులపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ డిమాండ్ చేశారు.